ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీసీపీ కె వుంది

ఓరుగల్లులో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకొచ్చాయి అనేది మీ అందరికీ తెలుసు.
ఉప ఎన్నికలు వచ్చినా పర్వాలేదు, నేను కోరుకొన్న వ్యక్తి మంత్రిమండలి లో
అనుకొన్నారు అంతే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు కారణం అయ్యారు. ఎంపీ పదవి లో ఉన్న
వ్యక్తి ని రాజీనామా చేయించి మంత్రి పదవి ఇప్పించారు. ఈ కారణంతో ఇక్కడ ఉప ఎన్నిక
వచ్చింది. టీఆర్ ఎస్ వాళ్లు ఎవరైన వచ్చి ఓటు అడిగితే మీరు వాళ్లని నిలదీయండి.

కేంద్రం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అడిగింది. అందుకోసం రాజీనామా
చేసి ఉంటే గర్వ పడేవాళ్లం. కానీ మీ పదవి మోజు కోసం ఉ ప ఎన్నిక వచ్చిందంటే ఎలా
ఉంటుంది.

దివంగత మహా నేత రాజశేఖర్ రెడ్డి పరిపాలన చూశాం. ముందు చూశాం. వెనుక చూశాం.
మీరు గుండల మీద చేయి వేసుకొని చెప్పండి. అంతకన్నా మంచి పాలన ఏదైనా ఉందా అని
అడుగుతున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన చేశారు. మనందరి గుండెల్లో
నిలిచే ఉన్నారు.

ఆ స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకొందాం. అంతకుముందు మంన చాలా మంది సీఎమ్ లు చూశాం.
పేదరికం పోవాలి అంటే ఏమి చేయాలి అనే దాని మీద అన్వేషించారు.

పేదరికానికి రెండు కారణాలు ఉంటాయి. పేదవాడు పిల్లల చదువుకి అప్పులు చేస్తారు.
పేదరికం పోవాలంటే ప్రతీ ఇంట్లో పేదవాడి పిల్లలు చదవాలి. పెద్ద పెద్ద చదువులు
చదవాలి. ప్రతీ పేదవాడి పిల్లల్ని చదివించేందుకు పీజు రీ ఇంబర్స్ మెంట్ల
తీసుకొచ్చారు. ప్రతీఇంట్లో పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ తెచ్చారు. అనేక మంది
నిరుపేదలకు నాణ్యమైన వైద్యం చేయించారు.

నేను రెండే చెబుతాను

1.     దేశం మొత్తం మీద 41 లక్షల
ఇళ్లు కట్టించారు. కానీ ఒక్క ఏపీ లోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు.

2.     రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల
ఎకరాలు పేదలకు పంచిన ఘనత ఆయనదే.

 ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు. ప్రతీ
దళితుడికి మూడు ఎకరాల చొప్పున పొలం ఇస్తామన్నారు. కానీ, 16 వందల ఎకరాలు కూడా
పూర్తిగా ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. కానీ ఎన్ని ఇళ్లు
కట్టించారు అని అడగండి. 395 ఇళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అది కూడా హైదరాబాద్
లోనే పూర్తి అయ్యాయి.

ఒక్క ఓరుగల్లు జిల్లాలోనే 150 మంది రైతులు ఆత్మహత్యలు
చేసుకొన్నారు. పత్తి రైతుకి కనీస మద్దతు ధర దక్కటం లేదు. గిట్టుబాటు ధర లేక
అల్లాడిపోతున్నారు. దీన్ని పట్టించుకోరా.

వైఎస్సార్ హయంలో పత్తి క్వింటాల్ కు ఆరు వేల రూపాయిలు పై
మాటే పలకింది. కానీ, ఇప్పుడు మాత్రం రూ. 3వేలు కూడా దక్కటం లేదు. పత్తి రైతుల
పరిస్థితి ఏమిటి..

ఫీజు రీ ఇంబర్సు మెంట్ కు అవసరమైన నిధులు ఇవ్వటం లేదు. 2014- 15 సంవత్సరానికి ఫీజు రీ
ఇంబర్స్ మెంట్ ను 2,452 కోట్ల కు గాను 1,530 కోట్ల మేర బకాయిలు ఉండిపోయాయి. ఎందుకు
నిరుపేదల విద్యార్థుల చదువుల్ని పట్టించుకోవటం లేదు. పేదల్ని పట్టించుకోని
పరిపాలనకు చరమగీతం పలకాలి. ఈ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటేస్తే ఆయన మారరు.

కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని మీరు అడగండి. వైఎస్సార్ గారు ప్రవేశ పెట్టిన
పథకాల్ని మీ పథకాలు అని చెప్పుకొంటే అటువంటి పథకాల్ని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు
అమలు చేయటం లేదని నిలదీయండి. విలువలు లేకుండా వ్యవహరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ.

తెలుగుదేశానికి ఓటు వేస్తే ఎప్పటికీ బాగుపడం.

తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయకూడదు, ఎందుకంటే  ఆ పార్టీ పునాదులన్నీ  మోసం దగా అబద్దాలు మీద ఉన్నాయి.

బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే.. ఆ పార్టీని నిలదీయండి. ఎన్నికల సమయంలో అనేక
హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయి అని అడగండి.

ఓటు అడిగే హక్కు కేవలం వైఎస్సార్సీసీకి మాత్రమే ఉంది. దివంగత మహానేత ప్రతీ
గ్రామానికి, ప్రతీ ప్రదేశానికి మేలు చేశారు. ప్రతీ ఒక్కరికీ మేలు చేసిన ఘనత ఒక్క
వైఎస్సార్ కే దక్కుతుంది. ఆ దివంగత నేత పరిపాలించిన స్వర్ణ యుగాన్ని తెచ్చుకొనే
ప్రయత్నం చేద్దాం.

ఇక్కడ మనతో ఉన్న నాయకుడు నల్లా సూర్య ప్రకాశ్ సౌమ్యులు, మంచి వ్యక్తి.

మీ ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆయన్ని గెలిపించండి. 

Back to Top