జగన్ రైతు దీక్ష పోస్టర్ విడుదల

తణుకు : జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీలలో వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వై.ఎస్,. జగన్మోహనరెడ్డి  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చేపట్టదలచిన రైతు దీక్ష పోస్టర్‌ను ఈనెల 19న దీక్షాస్దలి తణుకు పాత బెల్లం మార్కెట్ వద్ద విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర పార్టీ కార్యద ర్శులు  వి.విజయసాయి రెడ్డి , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , సాగి దుర్గాప్రసాదరాజు. ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, ఆళ్ల నాని , పార్టీ నాయకులు, నియోజకవర్గాల సమన్వయ కర్తలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో, సభలలో ఆచరణ సాధ్యం కాని  నూరు హామీలను ప్రజల కిచ్చారన్నారు. 44.6 శాతం మంది ఓటర్లు బాబును నమ్మి ఓట్లు వేశారన్నారు. బాబు ను నమ్మకుండా ఓట్లు వేసిన వారి శాతం 44.3 శాతమని, వీటి మధ్య వ్యత్యాసం కేవలం ఐదు లక్షలన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్ల కాలం పాటు ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిన బాబు లక్షణాలేమిటో అందరికీ తెలిసినవే అన్నారు. స్వంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అధికారం కోసం ఎవ్వరినైనా వెన్నుపోటు పొడుస్తారన్నారు. అబద్దాలకోరుతనం, అసమర్దత, అహంభావం కలిగిన బాబు వైఖరిని ఎండగడుతూ , రైతులకు బాసటగా నిలవడానికే జగన్మోహనరెడ్డి రైతు దీక్షను చేయబోతున్నారని , ఉభయగోదావరి జిల్లాల రైతుల సమస్య కాబట్టి దీక్షను తణుకులో చేస్తున్నామని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేమంటూనే ప్రత్యేక విమానాల్లో తిరిగే చంద్ర బాబు ఒక నిర్ధిష్టమైన ఆలోచన లేకుండా ముందుకెళుతున్నారని విమర్శించారు. అనంతరం సభాస్థలి వద్ద ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తో కలిసి పరిశీలించారు. 

Back to Top