- బాబు సీఎం అయ్యాక అన్నీ గోవిందా..గోవిందా– మహానేత ముఖ్యమంత్రి కాగానే రైతులకు ఉచిత విద్యుత్ –పెరిగిన గ్యాస్ ధరలు వైయస్‌ఆర్ భరించారు– చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ– ఈ నాలుగేళ్లలో మూడు సార్లు కరెంటు, ఆర్టీసీ చార్జీలు పెంచారు– భూములు లాక్కునే పరిపాలన సాగుతోంది– ప్రత్యేక హోదాను గాలికొదిలేశాడు.∙ – సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు– పిల్ల కాల్వలు తవ్వించలేని స్థితిలో టీడీపీ పాలన– ప్రజలకు భరోసా ఇవ్వడానికే ప్రజా సంకల్ప యాత్ర
కర్నూలు: మళ్లీ మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దిగిపోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే జరిగిందని, ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అభివృద్ధి చెందిందని వైయస్ జగన్ వివరించారు. మళ్లీ మన ఖర్మ కొద్ది చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రజా సంక్షేమ పథకాల బరువు తగ్గిందని, దారుణమైన పాలన సాగుతుందని మండిపడ్డారు. బాబు సీఎం కుర్చీ నుంచి దిగిపోతేనే మంచి రోజులు వస్తాయని తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టానని, అందరూ మద్దతుగా నిలబడి మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించాలని వైయస్ జగన్ కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్ చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఎండగట్టారు. మహానేత పాలనను గుర్తు చేశారు. వైయస్ జగన్ ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే..
– మీ అందరి ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు, ఆప్యాయతలకు పేరు పేరుకు కృతజ్ఞతలు.– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను చూసి ఇవాళ ప్రజలు విసుగెత్తిపోయారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఓ వ్యక్తి తాను చెప్పని అబద్ధం లేకుండా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ..హామీలిచ్చి ఆ తరువాత ఎవరిని కూడా వదలిపెట్టకుండా చంద్రబాబు అందరిని మోసం చేశాడు. –నాలుగేళ్ల ఈ పాలనను చూసిన తరువాత నేను అడుగుతున్నాను. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబే చెప్పారు. ఈ సంవత్సరం తరువాత మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనసాక్షిని అడగాలి.మోసం చేసే నాయకత్వం మనకు కావాలా? అబద్ధాలు చెప్పే నాయకత్వం మనకు కావాలా? –ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజమైన నాయకుడు కావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలుస్తుంది. లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఏదంటే అది చెప్పి ప్రజలను మోసం చేస్తారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి.– చంద్రబాబు పాలన చూస్తుంటే నాకు ఒక్కటే గుర్తుకు వస్తుంది. మన రాష్ట్రంలోని బడుల్లో చిన్న పిల్లలు ఆడుకునేందుకు బడిలో ఒక పెద్ద బల్ల ఉంటుంది. ఒక వైపు ఒకరు, మరోవైపు ఇంకోకరు కూర్చుంటారు. బరువు ఎక్కువ ఉన్నా వారు కిందకి వెళ్తారు. బరువు తక్కువ ఉన్నా వారు పైకి లేస్తారు. త్రాసు కూడా అంతే..చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చోంటే పేదలకు అందే సబ్సిడీ, సంక్షేమ పథకాలు అన్ని కూడా బరువు తగ్గిపోయి గాలిలో వేలాడుతున్నాయి. మళ్లీ చంద్రబాబును సీఎం కూర్చీ నుంచి దించితే అన్నీ కూడా బ్రహ్మండంగా ఉంటాయి.– గతంలో 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పాలనలో అందాక ఉన్న మద్య నిషేదం గోవిందా, సబ్సిడీ బియ్యం గోవిందా, ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా, వ్యవసాయం గోవిందా, వర్షాలు గోవిందా, సీఎం కుర్చీ కూర్చున్న వెంటనే ఇళ్ల నిర్మాణం గోవిందా..అన్ని గోవిందా గోవిందా.

– చంద్రబాబు దిగిపోయిన వెంటనే దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. వెంటనే ఉచిత విద్యుత్ వచ్చింది. బకాయిలు మాఫీ అయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వచ్చింది. ఏకంగా 24 లక్షల ఇల్లులు కట్టించారు. జలయజ్ఞంతో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు లేదు. గ్యాస్ ధర పెరిగినా కూడా నేనున్నాను భరించడానికి అని పేదలపై భారం వేయ్యలేదు. 108, 104 పథకాలు వచ్చాయి. పేదవాళ్లకు ఉచితంగా మందులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్య శ్రీతో పేదవాడికి మహానేత ఉచిత వైద్యం అందించారు. మళ్లీ రూ.2 కిలో బియ్యం పరుగెత్తుకుంటూ వచ్చింది.
–మన ఖర్మ కొద్ది మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. మళ్లీ ఆ త్రాసు మీద బరువు పెరిగింది. చంద్రబాబు బరువు పెరిగే సరికి రైతుల అప్పులు పెరిగాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బరువు తగ్గింది. ఫీజులు విఫరీతంగా పెరిగాయి. కరెంటు చార్జీలు మూడు సార్లు పెరిగాయి. ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచారు. 108 ఫోన్ కొడితే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. 104 గ్రామాల్లో ఎక్కడ కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ అన్న వైద్యం ఇవాళ హైదరాబాద్‌లో చేయరట. మళ్లీ పాతరోజులు వచ్చాయి. పరిశ్రమలు రాకుండా పోయాయి. ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. డోన్ నియోజకవర్గంలో పాలీష్ యూనిట్లు మూతపడ్డాయి. ఉద్యోగాలు అన్ని కూడా హుష్‌కాకి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు భయం భయంగా బతుకుతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది. భూపంపిణీ ఆగిపోయింది. పేదల నుంచి భూములు లాక్కొనే పని జరుగుతుంది. మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను రాకుండా గాలికి వదిలేశారు. గతంలో రేషన్‌షాపుకు వెళ్తే బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, కిరోసిన్, గోదుమలు ఇచ్చేవారు. బాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని ఎగురగొడుతున్నారు.
–మళ్లీ మంచి రోజులు రావాంటే ఏం చేయాలి. చంద్రబాబును కుర్చీలో నుంచి దించితే మంచి రోజులు వస్తాయని చరిత్ర చెప్పిన కథ. ఇవాళ ఇటువంటి పాలన పోవాలి. మంచి రోజులు మళ్లీ రావాలి.– ఇదే నియోజకవర్గంలో వైయస్‌ఆర్ హయంలో హంద్రీనీవాతో రూ.290 కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయించారు. పిల్లకాల్వలతో రైతులకు మేలు జరుగుతుంది. ఇలాంటి పిల్ల కాల్వలను కూడా తవ్వించలేని ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. మద్దికెర, తుగ్గలి, ఆర్‌ఎస్ పెండేకల్‌లో నాలుగు ఎస్సీ హాస్టల్స్, రెండు బీసీ హాస్టళ్లు మూసి వేశారు.–మోసపోయి ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాతల దుస్థితిని చూసి పాదయాత్ర చేపట్టాను. రైతులు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అవ్వతాతలకు, ఉద్యోగులకు తోడుగా ఉండేందుకు నేనున్నానని ధైర్యం చెప్పేందుకు ఈ పాదయాత్ర చేపట్టాను. ఈ పాదయాత్రలో తోడుగా నిలవాలని పేరు పేరున కోరుతున్నాను.– అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమ గోడు వెల్లబోసుకునేందుకు రైతులు వెళ్తే నిర్ధాక్ష్యంగా వారిని జైల్లో పెట్టించారు. వారితో సంతకాలు తీసుకున్నారట. ముందు రోజుల్లో ధర్నాలు చేయకూడదని సంతకాలు చేయించుకున్నారట. ఇలాంటి దారుణమైన పాలనను సాగనంపేందుకు మీ ముద్దుబిడ్డను ఆశీర్వదించండి, ఏడాది ఆగితే మన అందరి ప్రభుత్వం వస్తుందని హమీ ఇస్తున్నాను. నవరత్నాలు పథకాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సలహాలు ఇవ్వమని కోరుతున్నాను.– ఎంతటి దారుణంగా నారాయణరెడ్డిని పట్టపగలే చంపారు. ఈ పరిపాలనలో న్యాయం, ధర్మం లేదు. ప్రశ్నించే వారిని పట్టపగలే చంపుతున్నారు. నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవికి తోడుగా నిలవాలని కోరుతున్నాను.