టీమిండియాను అభినందించిన వైయస్ జగన్

హైదరాబాద్ః కాన్పూరు టెస్ట్ లో ఘనవిజయం సాధించిన టీమిండియాకు ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. 500వ టెస్ట్ లో భారత్ ఈవిజయం సాధించడం గర్వకారణమన్నారు. మిగిలిన మ్యాచ్ ల్లోనూ ఇదే జయభేరిని కొనసాగించి సిరీస్ సాధించాలని ఆకాంక్షించారు. కాగా, న్యూజిలాండ్ పై భారత్ మొదటి టెస్ట్ లో 197 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్ లు మిగిలున్నాయి.

Back to Top