<br/>హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం శివుడిని ఆరాదించే బక్తులకు, రాష్ట్ర ప్రజలంకు మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.<br/><br/>చెడు ఎంత దుర్మార్గమైనదైనా, అంతిమ విజయం మాత్రం మంచిదేనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. లోకంలోని ప్రజలందరినీ తన మూడో కంటితో సంరక్షిస్తున్న శివుడు, రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయన అభిలషించారు.