మాచర్ల కు వైఎస్ జగన్

గుంటూరు) గుంటూరు జిల్లా మాచర్ల లో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వచ్చే నెల 2న అంటే వచ్చే సోమవారం
వైఎస్సార్సీపీ తరపున కరువు, తాగునీటి ఎద్దడి సమస్యల్ని పరిష్కరించటంలో ప్రభుత్వ
వైఫల్యానికి నిరసనగా ప్రదర్శనలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మండల
కేంద్రాల్లో కార్యాలయాల ఎదుట ధర్నాలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా
మాచర్ల లో జరిగే నిరసనలో జన నేత వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లాలోని
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. 

Back to Top