మారేడుపల్లి పీహెచ్ సీని సందర్శించిన వైయస్ జగన్

కాకినాడ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం మారేడుపల్లి పీహెచ్‌సీని సందర్శించి, ఆస్పత్రిలో సదుపాయాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతంలోని ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. మారేడుమిల్లి నుంచి ఆయన వీఆర్‌పురం బయల్దేరారు. వీఆర్‌పురం మండలం అన్నవరంలో కాళ్లవాపు వ్యాధి మృతుల కుటుంబాలను వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అనంతరం రేఖపల్లిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కలసి మాట్లాడనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు.

తాజా ఫోటోలు

Back to Top