నంద్యాలలో వైయస్‌ జగన్‌ జెండా ఆవిష్కరణ

నంద్యాల:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో 71వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రం సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్సార్సీపీ అధినేత,  ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వైయస్ జగన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతాకి జై నినాదాలతో బొమ్మలసత్రం సెంటర్ మార్మోగింది.

Back to Top