టీమిండియాకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు హైదరాబాద్‌: ఆసియాకప్‌ టైటిల్‌ను ఏడోసారి గెలుపొందిన టీమిండియాకు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్‌ చేశారు. ఇక శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్‌ చివరి బంతికి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. 
Back to Top