రాజధాని ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటన

అమరావతి

 :వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 9.20 గంటల సమయంలో ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజధాని అమరావతి ప్రాంతానికి బయలుదేరారు. విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

 
మంగళగిరి శాసనసభా నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలోను, ఆ తర్వాత తాడికొండ నియోజకవర్గంలోని లింగాయపాలెంలో మధ్యాహ్నం నుంచి పర్యటిస్తారు. టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తున్న బాధిత రైతులతో జగన్‌ ముఖాముఖిగా మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుంటారు.

Back to Top