ప్రతిపక్షం పైన స్పీకర్ వివక్ష చూపుతున్నారు: వైఎస్ జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై  ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే మైకులు కట్ అవుతాయని, ప్రతిపక్ష నాయకుడిపై అవాకులు చవాకులు పేలితే అందుకు ప్రతిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని, గవర్నర్ ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు రెండు గంటలపాటు మాట్లాడిందే మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
Back to Top