నాన్నగారిది రామరాజ్యం..బాబుది రాక్షస పాలన




– విశ్వసనీయతకు వైయస్‌ఆర్‌ మారుపేరని  రైతులు చెబుతున్నారు
– జిల్లాలో 15 నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించడం పాపమంటున్నారు
– నాలుగేళ్లలో చంద్రబాబు అందర్ని మోసం చేశారు.
– పంటకు మద్దతు ధర ఉండదు..దాణా రేట్లు 
– సీడ్‌లో నాణ్యత లేదు..టెస్టులకు ల్యాబులు లేవు
– చేపలు,రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం
 – చంద్రబాబు పాలనలో మందు షాపు లేని గ్రామం లేదు
– బంగారం ఇంటికి రాలేదు..బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి
– చంద్రబాబే  దళారీలకు నాయకుడు 
– పొదుపు రుణాలు నాలుగు ధపాలుగా నేరుగా మహిళల చేతికే ఇస్తాం
– డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
– ప్రతి పేదవారికి పక్కా ఇల్లు నిర్మిస్తాం
– అవ్వాతాతలకు నెలకు రూ.2 వేల పింఛన్‌
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌
– పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు
 
పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది రామరాజ్యమైతే..చంద్రబాబుది రాక్షస పాలన అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. నాలుగేళ్లలో చంద్రబాబు అందరిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామారాజు పేరు పెడతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులను ఆదుకుంటానని, డ్వాక్రా సంఘాల అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఆకివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..

– ఎండలు అదరగొడుతున్నాయి. మండుతున్న ఈ ఎండలను ఏమాత్రం ఖాతరు చేయకుండా వేలాది మంది నాతో పాటు అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కష్టాలు చెప్పుకుంటూ, అర్జీలు ఇస్తున్నారు. మరోవైపు నా భుజాన్ని తడుతూ..అన్నా..నీవెంటే మేమున్నామని చెబుతున్నారు. ఏ ఒక్కరికి ఈ ఎండలో నడవాల్సిన అవసరం లేదు. ఈ దుమ్ములో, ధూళిలో నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాపై ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. 
– ఈ రోజు ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా..ఈ నియోజకవర్గంలో రైతులన్నలు నావద్దకు అన్న మాటలు ఏంటో తెలుసా? అన్నా..ఇద్దరు నాయకుల గురించి మీకు చెబుతామన్నా..ఒక్కరు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి..ఏదైనా మాట చెబితే మాట మీద నిలబడేవారు. అడకపోయినా కూడా మా నియోజకవర్గంలో రూ.800 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించారు. ప్రాజెక్టులు కట్టి ముందడగు వేశారు. చంద్రబాబు నాలుగేళ్లలో ఏ ఒక్క మంచి పని చేయలేదని వాపోతున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు 15 నియోజకవర్గాలు ఇస్తే మా జిల్లాకు చేసింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  అన్నా..ఒక్క రోడ్డు వేయలేదు.. ఇవాళ మంచినీళ్లు దొరకని పరిస్థితిలో మేం తాగుతున్నా నీళ్లు ఇవన్నా..అని బాటిల్‌ చూపిస్తున్నారు. నిజంగా ఈ బాటిల్‌ చూసినప్పుడు ఇది చెరకు రసం కాదు చంద్రబాబు..తాగే మంచినీళ్లు చంద్రబాబు అని ప్రజల తరఫున చంద్రబాబుకు చూపిస్తున్నాను. నీళ్లు కావాలని, రోడ్డు కావాలని చివరకు దీక్షలు చేయాల్సి వస్తోంది. 
– ఇదే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందని తాగునీటిని చూపిస్తున్నారు. చుట్టూ నీళ్లు కనిపిస్తున్నాయి. తాగడానికి గుక్కెడు నీరు లేదు. బోర్లు వేస్తే ఉప్పు నీరు. నీరు లేకపోవడంతో చేపల చెరువులు రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. డ్రైన్లుసక్రమంగా లేక నీరు కలుషితమవుతోంది. ఇలా బతకాలన్నా అంటున్నారు. నాన్నగారి పాలన మాకు గుర్తింది అంటున్నారు. చెరువులు నింపాలని నాన్నగారు ఒక స్వప్నాన్ని చూశారన్నా..నాన్నగారు చేపట్టిన ఆ కార్యక్రమంలో 45 కిలోమీటర్లలో 30 కిలోమీటర్లు నాన్నగారు పూర్తి చేశారు. రెండు రక్షిత మంచినీటి ట్యాంకులు పూర్తి చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత చిలకంపాడు లాకుల నుంచి నీరు తెచ్చే నాథుడు లేడన్నా అంటున్నారు. ఈ రోజు తాగడానికి నీళ్లు లేక, ప్రాజెక్టు పూర్తి కాక రూ.600 నుంచి 700 పెట్టి ట్యాంకు నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. చంద్రబాబును మీ అందరి తరఫున అడుగుతున్నాను. వైయస్‌ఆర్‌ది రామరాజ్యం కాదా..మీది రాక్షస పాలన కాదా అని అడుగుతున్నాను.
– నాడు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని, మూడు సెంట్ల స్థలం ఇస్తాననన్నారు. నాలుగేళ్లు పూర్తి అయ్యింది ఒక్క ఇల్లు కట్టించలేదు. వైయస్‌ఆర్‌ హయాంలో నియోజకవర్గంలో వేల  ఇల్లు కట్టించారని గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ దొరగారి చెరువును కబ్జా చేసి అక్కడ మాల్టికాంప్లెక్స్‌ కడతారట. ఈ పెద్ద మనిషికి పేదవాళ్లుకు మూడు సెంట్ల స్థలం ఇవ్వడు కానీ..ఎమ్మెల్యే అడిగితే 350 ఎకరాలను దారాదత్తం చేస్తాడు. ఎకరా కోటిన్నర చేసే భూమిని కేవలం రూ.12.50 లక్షలకు ఇచ్చారు. కారణం చంద్రబాబుకు లంచాలు ముడుతాయి కాబట్టి భూములు ధారాదత్తం చేశారు.
– నికర జలాల అలాంట్‌మెంట్‌ ఉన్నా..350 క్యూసెక్కుల నీరు కూడా ఇవ్వడం లేదన్నా అంటున్నారు. సాగునీరు అందక పంటలు కొల్పోతున్నాయని, దిగుబడులు తగ్గుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గోదావరి జి ల్లాలో ఉన్నామా? వెనుకబడిన రాయలసీమలో ఉన్నామా అని అనుమానంవ్యక్తం చేస్తున్నారు.
– నాలుగేళ్లలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. వరి క్వింటాల్‌ రూ.1100 కొనుగోలు చేసే నాథుడు లేడు. అన్నా..జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా రంగంలో ఆధారపడి జీవనోపాధి పొందుతున్నామని చెబుతున్నారు. సబ్‌ స్టేషన్‌ పరిస్థితి దేవుడెరుగు..కనీసం కరెంటు కనెక్షన్‌ ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.  ఆక్వా పంటను అమ్ముకోలô ని స్థితిలో ఉన్నారు. వంద కౌంట్‌ రొయ్య రూ. 160లకు కూడా అడగడం లేదు. చేపలను రూ.80 కొనుగోలు చేయడం లేదు. రేట్లు చూస్తే పంట చేతికి రాకముందు బాగుంటాయి. పంట చేతికొచ్చాక రేట్లు తగ్గించి దళారులు దోచుకుంటున్నాయి చెబుతున్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలన చేయాల్సి ఉండగా చంద్రబాబే దళారీలకు నాయకుడిగా మారాడు.
– రబీకి నీరు రాక రైతులు అవస్థలు పడుతుంటే..ఒక చెరువులో నుంచి మరో చెరువులోకి నీరు తోడుకొంటున్న సమయంలో ఈ నీళ్లు కలుషితమై వైరస్‌ సోకి చేపలు బతకడం లేదు. అయినా నీళ్లు ఇవ్వని పరిస్థితి. చేపలు, రొయ్యల సీడ్‌ చూస్తే ఆందోళన కరంగా ఉంది. హాచరీలు పుట్టగొడులుగా వెలిశాయి. అక్కడి నుంచి తెచ్చుకున్న సీడ్‌ను పరీక్షించుకోవాలంటే గవర్నమెంట్‌ ల్యాబ్‌లు మూత వేస్తున్నారని, ప్రయివేట్‌ ల్యాబ్‌లను ప్రోత్సహిస్తున్నారని, కల్తీ సీడ్‌ సరఫరా చేయడంతో నాశనమవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.  అన్నా..మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క రేటు లేక అవస్థలు పడుతుంటే..దాణా రేటు మాత్రం విఫరీతంగా పెరుగుతుందని వాపోతున్నారు. ఆయిల్‌ రేటు తగ్గినా కూడా కంపెనీ మాత్రం దాణా రేట్లు తగ్గించడం లేదు. నియంత్రణ చేసే పరిస్థితి లేదు.  కోల్డు స్టోరేజీలు లేవు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. అన్నా..నాన్నగారి పాలన గుర్తింది.. ఆ రోజుల్లో యూనిట్‌ కరెంటు రూ.90 పైసలు ఉంటే..చంద్రబాబు రూ.3.75 వసూలు చేస్తున్నారు. విఫరీతంగా ఫెనాల్టీలు వేస్తూ దోచుకుంటున్నారని చెబుతున్నారు.
– ఆక్వా రంగంలో బతుకుతున్న ప్రతి రైతుకు నేను చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..చేపలు, రొయ్యలకు ఇచ్చే కరెంటుకు రూ.1.50కే ఇస్తాను. ఐస్‌ఫ్యాక్టరీ, ప్రాసెసింగ్‌ యూనిట్లకు కరెంటు చార్జీలు రూ.7 నుంచి రూ.5 తగ్గిస్తామని మాట ఇస్తున్నాను. సీడ్‌ నుంచి ఫీడ్‌ వరకు నాణ్యత పరంగా తోడుగా ఉండేందుకు మంచి ల్యాబ్‌లు తీసుకొస్తాం. చట్టాలు తీసుకువస్తాం. మద్దతు ధర కల్పించేందుకు ^è ర్యలు తీసుMýంంటాను. కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు తోడుగా ఉంటానని చెబుతున్నాను. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీకు ఎలాంటి నాయకుడు కావాలి? అబద్ధాలు చెప్పేవారు..మోసం చేసేవారు నాయకుడుగా కావాలా? మీలో ఎవరైనా చంద్రబాబు పాలనలో సంతృప్తిగా ఉన్నారా? అబద్ధాలు, అవినీతి, రాజ్యాంగాన్ని హేలన చేయడం, అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులతో పట్టుబడటం మనం చూశాం. చంద్రబాబు మోసం చేయని వర్గం, కులం లేదు. 
– నాలుగేళ్ల క్రితం చంద్రబాబు అన్న మాటలేంటి? పిల్లలు తాగి చెడిపోతున్నారట. అధికారంలోకి వస్తేనే తాగుడు తగ్గిస్తాను. బెల్టు షాపు లేకుండా చేస్తానని చెప్పారు. అంతేకాదు సీఎం పదవి చేపట్టగానే బెల్టు షాపు లేకుండా చేస్తానని మొదటి సంతకం చేశారు. మినరల్‌ వాటర్‌ ఉన్న గ్రామాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ..మందు షాపు లేని గ్రామం ఉందా? కంప్యూటర్‌ తానే కనుగోన్నానని, సెల్‌ఫోన్‌ తెచ్చింది తానే అని చెప్పుకుంటున్నారు. ఈయన గారి పాలనలో ఫోన్‌ కొడితే చాలు మందుబాటిల్‌ ఇంటికి తెస్తున్నారు. 
– ఇదే పెద్ద మనిషి సీఎం కాకముందు రేషన్‌షాపులో బియ్యం, కందిపప్పు, చక్కెర వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇవాళ బియ్యం తప్పమరేమి దొరకడం లేదు. ఈ పరిపాలనను గమనించండి. పెట్రోలు షాపుకు వెళ్తే పక్క రాష్ట్రాల కంటే లీటర్‌కు రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కరెంటు చార్జీలు షాక్‌ కొడుతున్నాయని, అధికారంలోకి వస్తేనే కరెంటు చార్జీలు తగ్గిస్తా అన్నాడు. ఈయన సీఎం కాకముందు కరెంటు బిల్లులు రూ.50, 100 వచ్చేది. ఇప్పుడు రూ.500, 1000 వస్తోంది. 
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి. టీవీలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ చూస్తే ఓ అక్క ఉంటుంది.. అక్క మెడలోని మంగళ సూత్రం ఓ చెయ్యి వచ్చి లాక్కెళ్తుంది. వెంటనే ఓ చెయ్యి వచ్చి పట్టుకుంటుంది. వెంటనే ఆయనొస్తున్నారు. అని ఊదరగొట్టారు. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం లేదు. పొదుపు సంఘాలను తానే కనిపెట్టానని గొప్పలు చెప్పుకున్నారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు.  నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను.  ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఆడవాళ్లకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తే ఇంటికి అరిష్టం అంటారు. నాలుగేళ్ల పాలనలో కన్నీరు పెట్టని ఆడవాళ్లు ఉన్నారు.
– బుద్దున్నోడు చిన్నపిల్లల జోళికి వెళ్లడు. ఈ పెద్ద మనిషి ఏమన్నారు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని లెటర్లు ఇచ్చారు. నాలుగేళ్లు అవుతున్నా..ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఎక్కడైనా కనిపిస్తే..ప్రతి ఇంటికి రూ.96 వేలు బాకీ పడ్డారు..ఎప్పుడిస్తారని నిలదీయండి. 
– అబద్ధాలు చెప్పడం..మోసం చేయడం..అన్యాయం, అవినీతి ఈ నాలుగేళ్లలో చూశాం. 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు చంద్రబాబు ఏం చెబుతారో తెలుసా? ఇంకా పింఛన్లు ఇవ్వలేదా? నాకు తెలియదే అంటారు. ఇన్నాళ్లు గుర్తుకు రాలేదు..నిరుద్యోగ భృతి ఇప్పుడు గుర్తుకు వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయంటే ఆర్టీస్టులు, డ్రామాలు, సినిమా స్క్రిప్టులు. ఇలాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడదు. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. 
– చంద్రబాబును పొరపాటున క్షమిస్తే..రేపొద్దున చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? మీరు చిన్న చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని..రేపొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. నమ్ముతారా? ..నమ్మరు కాబట్టి..కేజీ బంగారుకు బొనస్‌ బెంజి కారు అంటారు. అయినా నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. డబ్బులు ఇస్తామంటే వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి లాక్కున్నవే. కానీ ఓట్లు వేసేటప్పుడు మీ మనసాక్షి ప్రకారం వేయండి. అబద్ధాలు చెప్పేవారు..మోసం చేసేవారు బంగాళఖాతంలో కలిసేలా బుద్ధి చెప్పండి.
– ఇటువంటి అన్యాయమైన పాలన పోయి..మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాల ద్వారా చెప్పాం. నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెబితే సమయం సరిపోదు. ఈ మీటింగ్‌లో అక్క చెల్లెమ్మల కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను.
– దేవుడు ఆశీర్వదించి..మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..అక్క చెల్లమ్మలకు తోడుగా ఉంటాను. ఆ రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికారులను చేసేందుకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారు. ఆ రోజులు ఇవాళ పోయాయి. పొదుపు రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ..ఇవాళ ఆయన చేసిన మోసం..అన్యాయం ఏంటో తెలుసా? బ్యాంకులు మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవి. ప్రభుత్వమే వడ్డీ డబ్బులు బ్యాంకులకు చెల్లించేది. చంద్రబాబు సీఎం అయ్యాక వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం మానేశారు. ఇవాళ ఆ అక్కాచెల్లెమ్మల కోసం చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం వచ్చాక..ఎంతైతే  అక్కచెల్లమ్మలకు బ్యాంకులో అప్పులు ఉన్నాయో..ఆ మొత్తం అప్పంతా కూడా నేరుగా నాలుగు ధపాలుగా మీ చేతికే ఇస్తాను. అంతేకాదు..నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే..జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాను. బ్యాంకులు సగర్వంగా అక్కచెల్లెమ్మలను ఆహ్వానించి రుణాలు ఇచ్చే రోజులు తీసుకొస్తాను. 
–  ఇవాళ ప్రతి ఒక్క చోట పక్కా ఇల్లు కావాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని ఊదరగొట్టారు. నాన్నగారి హయాంలో 48 లక్షల ఇల్లు కట్టి దేశంతో పోటి పడ్డారు.  ఆ రోజులు మళ్లీ తీసుకొస్తాను. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను. అంతేకాదు..ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని మాట ఇస్తున్నాను. ఒక్కసారి అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తే..అది వారికి ఆస్తి అవుతుంది. ఎప్పుడైన డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పావలా వడ్డీకే రుణాలు పొందేలా చేస్తాను.
– అవ్వతాతలకు ఇచ్చే పింఛన్‌ పెంచాలంటే చంద్రబాబుకు మనసు రావడం లేదు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచాలంటే బాగా మనసు వస్తుంది. కారణం ఆయనకు కమీషన్లు వస్తాయి . అవ్వతాతల పింఛన్‌ పెంచితే జన్మభూమి కమిటీలకు మాత్రమే లంచాలు వస్తాయి. మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.1000 నుంచి రూ. 2 వేలు చేస్తాం. పింఛన్‌ వయస్సు 65 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకే తగ్గిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క వారం పనులు లేకపోతే పస్తులుంటున్నారు. ఇలాంటి అక్క చెల్లెమ్మల కోసం పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాను. 
– ఈ రోజు నావద్దకు వచ్చి క్షత్రీయ కులస్తులు నా వద్దకు వచ్చారు. అల్లూరి సీతారామారాజు ఇక్కడే పుట్టారు. స్వాతంత్ర పోరాటంలో గుండెలు చూపి ఎదురు నిలిచారు. అయితే ఈ ప్రభుత్వం ఆయనకు ఏమీ చేయలేదన్నా..అన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఈ జిల్లాకు అల్లూరి సీతారామారాజు జిల్లాగా పేరు మార్చుతానని మాట ఇస్తున్నాను. నవరత్నాల్లో ఏదైనా మార్పులు, చేర్పులు చేయాలంటే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఎవరైనా నా వద్దకు రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు పరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా నిలువమని కోరుతూ..మరోసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..






 
Back to Top