టీడీపీ ట్యాక్స్‌ల మోత‌




– బాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? 
– బాబు దళారీలకు నాయకుడై రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు
– గిట్టుబాటు ధరకు రైతన్న ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు
– జీఎస్టీతో పాటు జిల్లాలో టీడీపీ ట్యాక్స్‌ వసూలు
– అధికారంలోకి రాగానే కేపీఆర్‌ ఇండస్ట్రీ అనుమతులు రద్దు చేస్తాం
– కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ పెట్టిన కేసులు రద్దు చేస్తాం
– కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ను మూసివేయమని విజ్ఞప్తి చేస్తున్నా..
 

తూర్పు గోదావరి: జిల్లాలో జీఎస్టీతో పాటు తెలుగు దేశం పార్టీ ట్యాక్స్‌ వసూలు చేస్తూ దోచుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనర్హుడని విమర్శించారు. ప్రజలకు నష్టదాయకమైన కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ను మూసి వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

– ఈ రోజు పొద్దున నుంచి వేలాది మంది ఊరూరా అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవాల్సిన అవసరం లేకపోయినా..ఒకవైపు అర్జీలు ఇస్తూ..మరోవైపు కష్టాలు చెబుతూ అన్నా..నీకు తోడుగా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవాల్సిన అవసరం లేదు. వర్షం కురుస్తున్నా..ఖాతరు చేయడం లేదు. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆప్యాయతలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
– ఇవాళ అనపర్తి నియోజకవర్గంతో తిరుగుతూ ఉంటే..ఈ నియోజకవర్గ ప్రజలు, రైతులు నాతో అన్న మాటలు ఏంటంటే..అన్నా..మా నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉందన్నా..రాష్ట్రంలో జీఎస్టీ పేరుతో ట్యాక్సీల మోత మోగుతుంటే..ఈ జిల్లాలో టీడీపీ ట్యాక్స్‌ ఉందన్నా అంటున్నారు. ఆ ట్యాక్స్‌ వసూలు చేసే బాధ్యత మా ఎమ్మెల్యేకు అప్పగించారన్నా..లంచాలు కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్యేలు, చిన్నబాబు, పెద్దబాబు వరకు అందుతున్నాయని చెబుతున్నారు. అన్నా..ఈ నియోజకవర్గంలో లే అవుట్‌ వేయాలంటే ఎకరాకు రూ.2 లక్షలు చెల్లించాల్సిందే. మద్యం షాపు నుంచి ఎమ్మెల్యేకు నేరుగా ట్యాక్స్‌ వెళ్తుందని చెబుతున్నారు. 
– ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్యాన్ని తీసేస్తా అన్న పెద్ద మనిషి..ఇవాళ మినరల్‌ వాటర్‌ లేని గ్రామం ఉందో లేదో తెలియదు కానీ, మద్యం షాపు లేని గ్రామమే లేదన్నా అంటున్నారు. మా గ్రామంలో మా ఇంటి ముందే, మా వీధి చివర్లో మద్యం షాపులు పెట్టి మా పిల్లలను తాగుబోతులుగా మార్చుతున్నారని అక్కా చెల్లెమ్మలు వాపోతున్నారు. 
– ల్యాండ్‌ కనర్షన్‌ చేస్తే లంచాలు ఇవ్వాల్సిందే. ఇక్కడి రైతులు నాతో అన్న మాటలు..అన్నా..చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ అన్న సంగతి చంద్రబాబు సీఎం అయ్యాక మరిచిపోయారని చెబుతున్నారు. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు. బాబు సీఎం కాకముందు బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. ఈయన బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టడం మానేయడంతో వడ్డీలేని రుణాలు అందడం లేదు. ఎల్‌టీ లోన్లు మీద 6 శాతం రైతులు మరిచిపోయారు. ఇంత కన్నా దారుణం ఉంటుందా?
– కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర రూ.1550 ప్రకటించారు. వరికి ఈ ధర వస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టీడీపీ బినామీల పేరుతో అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తున్నారు. రైతులకు మాత్రం మద్దతు ధర రావడం లేదు. రూ.1150కు మించి ధర రావడం లేదు. బినామీలు మాత్రం దండుకోవడం చూస్తున్నాం.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క పంటకైనా మద్దతు ధర ఉందా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మన రాష్ట్రంతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో హెరిటేజ్‌ షాపులు పెట్టారు. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి దళారీ వ్యవస్థను తీసేయాల్సి ఉండగా , ఆయనే దళారులకు నాయకుడుగా ఉన్నారు.
– ఇదే నియోజకవర్గంలో టీడీపీ పాలన లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే..లింగాల చెరువు, వెంకటరాజు చెరువుల్లో మట్టిని కూడా అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం. మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి బిల్లులు, ఆ మట్టిని అమ్ముకొని డబ్బులు దండుకుంటున్నారు. ఇక్కడి నుంచి మట్టి నేరుగా రావులపాలెం కూడా వెళ్లుంది. బిక్కవోలు మండలంలో ల్యాండు సీలింగ్‌ యాక్ట్‌ ద్వారా చంద్రబాబు తన బినామీ ఎంపీ మురళిమోహన్‌ కూతురుకు 35 ఎకరాలు ధారదత్తం చేశారని ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఇవాళ అడిగే నాథుడు కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. 60 మంది నిరుపేదలు ఆ భూములు అనుభవిస్తుంటే...వాటిని తరిమేస్తున్నారు.
– నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు దారిపొడవునా ప్లేక్సీలు కనిపించాయి. కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ బ్యానర్లు కనిపించాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఈ కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌తో ప్రజలు కలుషితమవుతున్నారని, వాటిని రద్దు చేస్తామన్నారు. నాలుగున్నరేళ్లు అయినా కూడా ఇంతవరకు రద్దు చేయలేదు. అక్రమంగా కేసులు బనాయించారు. వాటిని ఉపసంహరించుకోలేదు. ఓట్ల కోసం టీడీపీ నాయకులు మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఈ కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌లో జగన్‌కు బాగముందని ఆరోపిస్తున్నారు. ఈ కే పీఆర్‌ ను రద్దు చేయాలని నేనే కోరుతున్నా..ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు. నోరు తెరిస్తే అవతలి వారిపై బండలు వేయడం, అబద్ధాలు ఆడటం. అధికారంలోకి వచ్చిన వెంటన కేపీఆర్‌ ఇండ్రస్ట్రీ అనుమతులు రద్దు చేస్తాను. 500 మందిపై ఉన్న కేసులు కూడా ఉపసంహరించుకుంటామని చెబుతున్నాను. కేపీఆర్‌ ఇండస్ట్రీస్‌ యాజమాన్యానికి కూడా చెబుతున్నాను. పరిశ్రమలు అవసరం. అయితే అవి పెట్టవలసిన ప్రదేశాల్లో పెట్టాలి. ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిలో అలాంటి పరిశ్రమలు వద్దు. మీ పరిశ్రమలు ఇక్కడి నుంచి షిప్ట్‌ చేసి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టండి..నేను సపోర్టు చేస్తానని మాట ఇస్తున్నాను. పారిశ్రామిక వేత్తలకు మద్దతిస్తాం. ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని ఆరాటపడుతారు .ఇలాంటి పరిశ్రమలతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు.
– ఇదే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు నాన్నగారి హాయంలో అనపర్తి మండలంలో 35 ఎకరాలు, బిక్కవోలులో 30 ఎకరాలు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో 16 వేల పక్కా ఇల్లు కట్టించారని నాన్నగారిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నాన్నగారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు లాక్కుంటున్న టీడీపీ నాయకులకు ఇది ధర్మమేనా? పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాల్సింది పోయి..మహానేత ఇచ్చిన ఇళ్ల స్థలాలు లాక్కోవడం ధర్మమేనా?చంద్రబాబు అన్యాయమైన పాలన గురించి చెప్పాను.

– నాలుగేళ్లలో చంద్రబాబు అన్యాయమైన పాలన చూశారు. మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. ఓటు వేసే టప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి. అబద్ధాలు చెప్పేవారు మీకు నాయకుడు కావాలా? మోసాలు చేసేవారు నాయకుడు కావాలా? ఇలాంటి వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయాల్లో నిజాయితీ, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం రావాలి. పొరపాటున అబద్ధాలు చెప్పే వ్యక్తులను, మోసం చేసే వారిని క్షమిస్తే ఈ వ్యవస్థ బాగుపడుదు. ఈ వ్యవస్థలో నిజాయితీ రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థను మార్చాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ సేపు మాట్లాడి నేను తడిసినా ఫర్వాలేదు.. నాతో పాటు మీరంతా తడవడం చూడలేకపోతున్నా..  వర్షం పడుతున్నా లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ...నాకు సంఘీభావంగా తోడుగా నిలిచిన మీ అందరి ఆదరాభిమానాలకు పేరు పేరున కృతజ్ఞతలు  చెబుతూ సెలవు తీసుకుంటున్నా..
Back to Top