రైలు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి

విజయనగరం:  ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాకు బయలుదేరారు. రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు.  దుర్ఘటన జరిగిన స్ధలాన్ని ఆయన పరిశీలించనున్నారు. 

రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి..:  రైలు ప్రమాదం గురించి తెలియగానే వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 
Back to Top