వైయస్ జగన్ రెండోరోజు భరోసాయాత్ర టూర్ షెడ్యూల్

అనంతపురం) ప్రతిపక్ష నేత,
వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లా లో
అప్రతిహతంగా సాగుతోంది. రెండో రోజు తాడిపత్రి నియోజక వర్గంలో ఆయన
పర్యటించనున్నారు. మొదటగా కిష్టిపాడు గ్రామానికి చేరుకొని అక్కడ బాధతో ఆత్మహత్య
చేసుకొన్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ
కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. తర్వాత నగరూరు గ్రామానికి వెళతారు. అక్కడ
అప్పుల బాధతో ఆత్మహత్య కు పాల్పడిన రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి
కుటుంబాల్ని వైయస్ జగన్ పలకరిస్తారు. ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా
కల్పిస్తారు.

          చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో దిక్కు తోచక రాష్ట్ర వ్యాప్తంగా
రైతాంగం, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
ఆయా వర్గాలకు భరోసా కల్పించేందుకు ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ భరోసా యాత్ర
చేపట్టారు. ఇప్పటిదాకా నాలుగు దశల్లో ఈ యాత్ర సాగింది. అయిదో దశ యాత్రలో
తాడిపత్రి, కదిరి నియోజక వర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు. 

Back to Top