వైయస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించాలని, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో ఇంటింటా వేడుకలతో సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆయన  ఆకాంక్షించారు.

సంక్రాంతి పేరు చెప్పగానే రైతులు, పల్లెలు గుర్తుకు వస్తాయని, రైతన్న, పల్లెసీమ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని తాను ఎల్లప్పుడు కోరుకుంటానని వైయస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 
Back to Top