మూడవ రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర

కర్నూలు : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  రైతు భరోసా యాత్ర కర్నూలులో మూడో రోజుకు చేరింది. వైయస్‌ జగన్‌  ఈరోజు ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. గ్రామం నుంచి రోడ్‌ షో గా అబ్దుల్లాపురం, వెలుగోడు మీదగా బోయరేవులు చేరుకుంటారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అనంతరం మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా రోడ్‌ షో లింగాపురం చేరుకుంటుంది.

Back to Top