చంద్రబాబూ..నీవు బాధ్యుడివి కాదా?

అమరావతి: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమవుతున్నాయని, నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే  ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని ఆయన విమర్శించారు. దాచేపల్లి ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌లో దాచేపల్లి ఘటనను ఖండించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే..నిందితులను సరిగా శిక్షించకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని, నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడానికి చంద్రబాబూ..నీవు బాధ్యుడివి కాదా? అని వైయస్‌ జగన్‌ నిలదీశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top