జ‌ర్న‌లిస్టులంద‌రికీ స్థ‌లాలిచ్చి..ఇళ్లు క‌ట్టిస్తాం- వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ
– రేపటి బంద్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకుల మద్దతు 
తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సామర్లకోటలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని, చంద్రబాబు సర్కార్‌ ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని తెలిపారు. సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకు ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని టీడీపీ సర్కార్‌ జీవో ఇవ్వడం సరికాదన్నారు.  వైయస్‌ జగన్‌ హమీతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. రేపు వైయస్‌ఆర్‌సీపీ చేపట్టే బంద్‌లో ఏపీయూడబ్ల్యూజే పాల్గొంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్‌ ప్రకటించారు. 
 
Back to Top