శ్రీవారిని దర్శించుకున్న వైయస్ జగన్

తిరుమల : ప్రజా సంకల్ప యాత్రకు ముందు వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వర ప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది రెడ్డి, రోజా, చెవిరెడ్డి, డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నారాయణ స్వామి, శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి పలువురు పార్టీ  నేతలు ఉన్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైయస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.

అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. కాగా, ప్రజా సంకల్ప యాత్ర నవంబర్‌ 6న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.
Back to Top