అద్భుతమైన పథకాలకు తూర్పు నాంది




మహానేత కుమారుడిగా రెండు అడుగులు ముందుకు
కౌలురైతులను ఆదుకుంటానని వైయస్‌ జగన్‌ ప్రకటన
రాజన్న రాజ్యస్థాపనకు కృషి చేస్తున్న జననేత
తూర్పుగోదావరిలోకి ప్రవేశించి నేటికి 55 రోజులు
పాదయాత్రకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజామద్దతు
తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌ నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని రైతులకు అండగా నిలబడేందుకు అనేక పథకాలు ప్రకటిస్తున్నారని చెప్పారు. తూర్పు సెంటిమెంట్‌గా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి నేటికీ 55వ రోజులవుతుందని, రోజు రోజుకు పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతాంగం ఏవిధంగా నష్టపోతున్నారో అధ్యయనం చేసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ వారి బతుకుల్లో సంతోషం నింపేందుకు అనేక పథకాలను రూపొందించారన్నారు. 

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా పేరు సాధించిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వ్యవసాయాన్ని దండగ చేశాడని వారు మండిపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని గోదావరిలో వైయస్‌ జగన్‌ ప్రకటించడం మరిచిపోలేని సంఘటన అన్నారు. వైయస్‌ఆర్‌ రైతుబాంధవుడని, ఇవాల్టికి రైతులు పట్టెడు అన్నం తింటున్నారంటే వైయస్‌ఆర్‌ చేపట్టిన ప్రాజెక్టుల వల్లేనన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నదాతలు నమ్మకంతో ఉన్నారన్నారు. వ్యవసాయ పెట్టుబడి ఇస్తానని చెప్పారని, ప్రతిరైతులకు జననేత అండగా నిలబడతారన్నారు. మాటమీద నిలబడే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని, జననేతతోనే వ్యవసాయం సస్యశ్యామలం అవుతుందన్నారు. 
 
Back to Top