అగర్వాల్‌ మృతికి వైయ‌స్‌ జగన్‌ సంతాపం

హైద‌రాబాద్‌: దైనిక్‌ భాస్కర్‌ గ్రూపు చైర్మన్‌ రమేష్‌ చంద్ర అగర్వాల్‌ మృతి పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అగర్వాల్‌ కుటుంబీకులకు జగన్‌ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో ప్రఖ్యాతిగాంచిన దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ చైర్మన్‌ రమేశ్‌ చంద్ర అగర్వాల్‌(73) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అహ్మదా బాద్‌కు విమానంలో చేరుకున్న ఆయనకు ఎయిర్‌పో ర్టులోనే గుండెపోటు రావ‌డంతో అక్క‌డే తుదిశ్వాస విడిచారు. 1944 నవంబర్‌ 30న ఝాన్సీలో జన్మించిన అగర్వాల్‌.. తండ్రి ద్వారకప్రసాద్‌ అగర్వాల్‌తో కలసి భోపాల్‌కు తరలివచ్చారు. 1958లో దైనిక్‌ భాస్కర్‌ వార్తాపత్రికను ప్రారంభించారు. అగర్వాల్‌ నేతృత్వంలో దైనిక్‌భాస్కర్‌ గ్రూప్‌ 14 రాష్ట్రాల్లో 62 ఎడిషన్లను పబ్లిష్‌ చేస్తోంది. సర్క్యులే షన్‌పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వార్తాపత్రికగా రికార్డుల కెక్కింది.

Back to Top