హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదివారం పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ...రేపు ఉదయం 11 గంటలకు లోటస్ పాండ్ లో ఎంపీలతో సమావేశమై చర్చిస్తారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 26 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. <br/>ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. ప్రత్యేక హోదాతో పాటు పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హమీలు, కరువు, అకాల వర్షాలు, కేంద్రసాయం, రాజధాని అంశంతో పాటు కీలక ప్రజాసమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు.