బాబు హామీలతో మోసపోయిన వారికి అండగా నిలిచిన వైయస్‌ఆర్‌సీపీ అధినేతవరుస పర్యటనలతో నిత్యం ప్రజల మధ్యే ప్రతిపక్ష నేతకర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రరాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా కిడ్నీ బాధితులకు తోడుగా నిలిచిన జననేతవైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర ప్రజలుజనం కోసం వైయస్ జగన్.. వైయస్ జగన్ కోసం జనం.. వాస్తవానికి జనం కోసం తపించే ప్రజా నాయకుడు, సమకాలీన రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్ ఒక్కడే అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో జయాపజయాలు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే వైయస్ జగన్ సొంతం. ఆయన ఎక్కడికి వెళ్లినా తనకోసం వచ్చిన జనాన్ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఏ ఊరు వెళ్లినా ప్రతి అవ్వా, అమ్మా మన రాజన్న బిడ్డ తన ఇంటికి వచ్చాడని సంబురపడతారు. ప్రతి అక్కా చెల్లెమ్మ తన తోడబుట్టిన వాడే తనను పలకరించడానికి వచ్చాడని మురిసిపోతారు. ప్రతి అన్నా, తమ్ముడు తన తోడ బుట్టినవాడే తనను తోడుగా నిలబడడానికి వచ్చాడని భరోసాగా ఫీలవుతాడు. ప్రతి ఒక్కరి కష్టాల్లో తోడుగా నిలిచిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు మనసున్న నాయకుడని గర్వంగా చెప్పుకుంటున్నారు.
కష్టాలు, సుఖాల్లోనూ వెన్నంటి నిలిచేవాడే నిజమైన నాయకుడు. అవసరానికి, అధికారం కోసం అబద్ధాలు చెప్పే వారు నాయకులు కారు. అధికార దాహం కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించారు. తీరా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఆ హామీలు గుర్తుకు రాలేదు. మూడేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో రాష్ట్ర ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు తోడుగా, నీడగా, అండగా నిలిచారు. అధికారంలో ఉన్నామా? లేదా అన్నది ముఖ్యం కాదని భావించారు. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. బాబు హామీలతో మోసపోయిన జనం కన్నీళ్లు తుడిచి..భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పడంతో బ్యాంకు రుణాలు కట్టడం మానేసిన రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మృత్యువాత పడిన రైతు కుటుంబాలను ఆదుకోవడం మరిచారు. దీంతో బాధిత కుటుంబాలకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. వారి కుటుంబాలను పరామర్శిస్తానని నాడు అసెంబ్లీలో ప్రకటించిన ప్రతిపక్ష నేత ఇప్పటికే ఐదు విడతలుగా అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆరో రోజుల పాటు కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. శ్రీశైలం నియోజకవర్గంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇదే సందర్భంలో రైతులు సాగు చేసిన పంటలను, ప్రాజెక్టులను పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
రాజధాని రైతులకు తోడుగా..నవ్యాంధ్ర రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు రైతులను బెదిరించి మూడు పంటలు పండే బంగారులాంటి భూములు స్వాధీనం చేసుకున్నారు. అయితే వారికి ఇస్తానన్న పరిహారం ఇవ్వలేదు. ప్లాట్లు పంపిణీ చేయలేదు. ఇలాంటి సమయంలో రాజధాని రైతులకు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తోడుగా నిలిచారు. ఇటీవలే రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాజధానిలో పర్యటించిన వైయస్ జగన్....ఈ నెల 19న రాజధాని ప్రాంతంలో మరోసారి పర్యటించి రైతులు, కూలీల సమస్యలు తెలుసుకున్నారు. రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దారుణాలు చూసి వైయస్ జగన్ చలించిపోయారు. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుందంటూ లీకులిచ్చి తనకు కావాల్సిన వారికి మంచి జరిగేలా చూసుకొని రైతులను మాత్రం చంద్రబాబు మోసం చేశారు. రాజధాని ప్రాంతాల్లోని కనకదుర్గ వారధి వద్ద అదేవిధంగా నిడమ్రరు, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు.
రాజధాని పేరుతో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చట్టం పేరిట బాబు ఇష్టమొచ్చినట్లుగా భూములు లాక్కోవడంపై వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తీవ్రంగా దెబ్బకొట్టి తన బినామీలకు, తన చెప్పుచేతల్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనూకూలంగా భూసేకరణ చేశారని, అది కూడా అవసరానికి మించి వేల ఎకరాలను లాగేసుకుని రైతును రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన లాభాలను తనకు వచ్చేలా చంద్రబాబు చేసుకున్నారని అన్నారు. రైతులకు మేలు జరగకూడదనేదే తన అభిమతం అన్నట్లుగా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో లింగాయపాలెంలో రైతుల అరటి తోటల్ని చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండేవారే తగులబెట్టారని చెప్పారు. చంద్రబాబు ఏం చేసినా టెంపరరీ.. టెంపరరీ, టెంపరరీగానే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని చుట్టుపక్కల జరిగేవన్నీ కూడా కుంభకోణాలే అని అన్నారు. బొగ్గు, ఇసుక, మద్యం, ఆఖరికి గుడి భూముల్లో కూడా చంద్రబాబు కుంభకోణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు చంద్రబాబు తన అత్తగారి సొమ్మని అనుకుంటున్నారని, అందుకే వివక్ష చూపిస్తూ వారికి కేవలం 500 గజాలు ఇస్తానని చెప్పి అంతటితో సరిపెట్టుకోమంటున్నారని ఇదెక్కడి న్యాయమని వైయస్ జగన్ ప్రశ్నించారు. మరో రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం వస్తుందని, రాజధాని నిర్మించే బాధ్యత వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, ప్రజా రాజధాని నిర్మిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక రెండు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తానని, రైతులు తమ భూముల్లో వ్యవసాయమైనా చేసుకోవచ్చు. లేదా ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని ప్రకటించడంతో రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖి కార్యక్రమాల్లో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు మాట్లాడుతూ..అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
బాబుకు కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగులుతుందిప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బరువెక్కిన హృదయంతో అన్నారు. చంద్రబాబుకు జిల్లాలోని ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు కళ్లారా చూశాకైనా బాబు మనస్సు కరిగించుకోవాలని సూచించారు. ఈ నెల 20న ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లిలో జగన్ ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలసి పరామర్శించారు. వారి కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. వ్యాధిగ్రస్తులకు మందుల కోసం నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, వారి కుటుంబాలు గడవడం కోసం భృతి చెల్లించాలని సర్కార్‌ను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ఉచిత వైద్యం..కిడ్నీలు పాడైనా.. అనారోగ్యం వచ్చినా నేనున్నా... అని, లక్షలు ఖర్చయినా భయపడవద్దంటూ పేదలకు భరోసా కల్పించారు. మహానేత∙పాలనలో పేదలు అప్పులపాలు కాకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకొని నవ్వుతూ తిరిగి వచ్చేవారు. తాను అధికారంలోకి వచ్చాక వైద్యం కోసం పేదవాళ్లు అప్పులపాలు కాకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభావేదికపైనే వైయస్ జగన్ సీఎం కావాలని నినదించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలని, మనసున్న నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.==============ప్రభుత్వం కక్షసాధింపు చర్యలురాజధానిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతం కావడంతో టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై దాడికి పాల్పడ్డారంటూ అసత్య ప్రచారాన్ని సాకుగా చేసుకుని అమాయకులైన ఎనిమిది మంది యువకులపై తప్పుడు కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండలానికి చెందిన ఎనిమిది మంది యువకులను పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అదే సమయంలో వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఏకంగా ఫ్లెక్సీలు పట్టుకుని రోడ్డుకు అడ్డుగా నిలబడ్డ టీడీపీ కార్యకర్తలను విడిచి పెట్టడం గమనార్హం. రాజధానిలో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైయస్ జగన్ ఈ నెల 19న తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలో పర్యటించిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా నాలుగు 420 బ్యాచ్‌లను టీడీపీ నేతలు రంగంలోకి దింపారు. అయినా పర్యటన విజయవంతం కావడంతో... పర్యటనలో పాల్గొన్న అమాయక యువకులపై కేసు నమోదు చేయించారు. సీసీ పుటేజీలో ఎవరు, ఎవరిని అడ్డుకున్నారో స్పష్టత లేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బైక్ ర్యాలీ వస్తుండటంతో వాహనాలేవీ సచివాలయంలోకి వెళ్లే అవకాశం లేదని పోలీసులతో పాటు, ర్యాలీలో పాల్గొన్న వారు వెలగపూడి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు వెళ్లడించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనాన్ని అటువైపు వెళ్లాలని ర్యాలీలో పాల్గొన్నవారు సూచించినట్లు స్పష్టం చేశారు. వాస్తవంగా వాహనంలో ఉన్న మహిళ ఎమ్మెల్యే అని కానీ, భూమా నాగిరెడ్డి కుమార్తె అని కాని ర్యాలీలో పాల్గొన్న చాలామందికి తెలియదని స్థానికులు చెప్పారు. ఆమె ఎవరో తెలియనప్పుడు దాడి ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో సాగుతున్న ప్రతిపక్ష నేత పర్యటనపై పోలీసుల ఆంక్షలు విధించారు. వెలగపూడి మార్గంలో కురగల్లు వెళ్లేందుకు వైయస్ జగన్ కాన్వాయ్ లో నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. వైయస్ జగన్ వెంట ఉన్న మిగతా వాహనాలను పెద్దపరిమి వైపు దారి మళ్లించారు. ఇలా టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రతిపక్ష పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.