వైయస్‌ జగన్‌ కష్టాన్ని ప్రజలంతా చూస్తున్నారు

  • రాజన్నను మించిన పాలన జగనన్న అందిస్తారు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌
నెల్లూరు: జనం కోసం మూడు వేల కిలోమీటర్లు నడిచిన ఏకైక నాయకుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. భారతదేశంలో మరే నాయకుడు ఇంతటి పాదయాత్ర చేపట్టిన దాఖలాలు లేవన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పాదయాత్రలు చేయడం వైయస్‌ కుటుంబానికే చెల్లిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తరువాత సువర్ణ పాలన అందించారన్నారు. వైయస్‌ఆర్‌ను మించిన పాలన ఆయన తనయుడు వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎండా, వాన లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కో సం పాదయాత్ర చేస్తూ అందరినీ పలకరిస్తూ ముందుకుసాగుతున్న వైయస్‌ జగన్‌ కష్టాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. రాజన్న బిడ్డను ఆశీర్వదిద్దాం.. రాజన్న రాజ్యం స్ధాపించుకుందామని ప్రజలు భావిస్తున్నారన్నారు. 
 
Back to Top