వైఎస్ జగన్ నిరాహార దీక్ష

హైదరాబాద్ః కృష్ణా, గోదావరి డెల్టాలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే నెల 16,17,18 తేదీల్లో కర్నూలులో వైఎస్ జగన్ స్వయంగా దీక్షలో కూర్చోనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా అడ్డగోలుగా నీళ్ల మళ్లింపును నిరసిస్తూ వైఎస్ జగన్ దీక్ష చేపడుతున్నారు. ప్రజలు కరువుతో తీవ్రంగా అల్లాడుతున్నారని, లక్షలాది ఎకరాలు బీడులుగా మారిపోయాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు విలవిలలాడుతున్నారు. రాజకీయాలను పక్కనబెట్టి మనుషులుగా ఆలోచన చేయాలన్నారు. కరువు పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని చెప్పారు.

Back to Top