పార్లమెంటరీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆపార్టీకి చెందిన కొందరు ఎంపీలతో సమావేశమయ్యారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్ల సమాచారం. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో పార్టీ ఎంపీలంందరితో రాష్ట్ర సమస్యలపై విపులంగా పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Back to Top