గుంటూరుకు వైయస్ జగన్

హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  గుంటూరు బయల్దేరారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి రూరల్‌ మండల పరిధిలోని హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటారు.

కాగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా కుమార్తె షేక్‌ నూరి ఫాతిమా వివాహ వేడుకకు వైయస్‌ జగన్‌ హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్‌ పయనం అవుతారు.
Back to Top