బాధితులకు అండగా పాల్మన్ పేటకు వైయస్ జగన్

విశాఖపట్నం:  వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  నేడు విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.  మధ్యాహ్నానికి  వైయస్ జగన్  విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి  పాయకరావుపేట నియోజకవర్గంలోని పాల్మన్‌పేటకు వెళ్లి స్థానిక మత్స్యకారులను పరామర్శిస్తారు.

గత నెలలో అధికార టీడీపీ నేతల అండతో కొందరు ఈ గ్రామంపై దాడిచేసి స్థానికులను గాయపర్చడంతోపాటు, వారి ఆస్తులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ జగన్ బాధితులతో  మాట్లాడి భరోసా కల్పించనున్నారు.

Back to Top