పసుపు, అరటి రైతులతో వైయస్ జగన్

కర్నూలుః రైతు భరోసా యాత్రలో భాగంగా వైయస్ జగన్ ఈ ఉదయం మహానంది మండలం, శ్రీనగరంలో పర్యటిచారు. పసుపు, అరటి రైతులను కలుసుకున్నారు. గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీపై ఆరా తీశారు. గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైయస్ఆర్ హయాంలో పంటలకు సరైన మద్దతు ధర ఉండేదని, ఆయన దేవుడు అని రైతులు తలచుకున్నారు. రైతుల కష్టాలు తెలుసుకున్న అనంతరం  వైయస్ జగన్ మహానందీశ్వరుని దర్శించుకున్నారు. జగన్ కు ఆలయ అర్చకులు అపూర్వ స్వాగతం పలికారు. ఆలయంలో వైయస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Back to Top