రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి

అనంతపురంః ప్రతిపక్ష నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర  అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. పెద్దవడుగూరులో వైయస్ జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ....ప్రభుత్వ మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. రుణమాఫీ చేస్తానని చెప్పి బాబు మాట తప్పారని మండిపడ్డారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వర్షాలు కూడా రాకుండా పోతున్నాయని ఎద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను బాబు మోసం చేశారని దుయ్యబట్టారు.


For English version: http://goo.gl/seLqYo
Back to Top