రాష్ట్రప‌తికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జ‌గ‌న్

క‌డ‌ప‌: రాష్ట్ర ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ ఉద‌యం రాష్ట్ర‌ప‌తి భార్య శుభ్రా ముఖ‌ర్జీ క‌న్ను మూశారు. కొంత కాలంగా శ్వాస కోశ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న ముఖ‌ర్జీ ఢిల్లీ లోని ఆర్మీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకొంటున్నారు. ప‌రిస్థితి చేయి దాట‌డంతో ఆమె క‌న్ను మూశారు. ఆమె మృతికి అనేక మంది ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ అభిల‌షించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Back to Top