పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టిన‌ వైయ‌స్ జ‌గ‌న్

చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 50వ రోజు మంగ‌ళ‌వారం చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజల బ్రహ్మారథం పడుతున్నారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు జననేతకు పూలతో స్వాగతం పలుకుతూ వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మ‌ద‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని సీటీఎం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభం కాగా అక్క‌డి నుంచి పులవండ్ల పల్లి, కాశీరావు పేట మీదుగా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని వాల్మీకిపురం గ్రామంలోకి ప్రవేశించారు. పార్టీ నేతలు, గ్రామస్తులు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రజల నీరాజనాల నడుమ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహిళలు హారతి పట్టి, దిష్టి తీశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ వర్గాల ప్రజలు పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి తండోపతండాలుగా తరలిరావ‌డంతో వాల్మీకిపురం జ‌న‌సంద్ర‌మైంది.  ఈ సంద‌ర్భంగా ప‌లువురు త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత దృష్టికి తీసుకెళ్లారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అలాగే మ‌న ప్ర‌భుత్వం రాగానే అక్కాచెల్లెమ్మ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని, డ్వాక్రా రుణాలు నాలుగు విడ‌త‌ల్లో మాఫీ చేసి ఆ డ‌బ్బులు మీ చేతికే ఇస్తామని మాట ఇచ్చారు. 

Back to Top