టీడీపీ దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ జగన్ ధర్నా

అనంతపురంః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నినాదాలతో అనంతపురం మార్మోగుతోంది. వైయస్ జగన్ యాత్ర జనజాతరను తలపించింది. తమ అభిమాన యాత్రకు జనం నీరాజనం పట్టారు. పూలవర్షం కురిపించారు. వేలాదిగా తరలవచ్చిన అశేష జనవాహిని మధ్య వైయస్ జగన్ అనంతపురం చేరుకున్నారు. వైయస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా వైయస్ జగన్ ధర్నా నిర్వహించారు. వైయస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు టీడీపీ కుట్రలను తిప్పికొట్టారు. పెద్ద ఎత్తున అనంతకు తరలివచ్చి వైయస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

Back to Top