శ్రీకాంత్‌కు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు
నెల్లూరు :  బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌కు ప్రతిపక్ష నేత, వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయిన విషయం తెలిసిందే. శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై వైయ‌స్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలుగువారి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వైయ‌స్‌ జగన్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు..
Back to Top