అభిమాన కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

అభిమాన కుటుంబానికి ప‌రామ‌ర్శ‌
ఏలూరు)  ఉభ‌య‌ గోదావ‌రి జిల్లా ల్లో ప్ర‌తిప‌క్ష నేత, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి కి చేరుకొన్నారు. అక్క‌డ మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్ నివాసానికి చేరుకొన్నారు. ఇటీవ‌లే ఉండ‌వ‌ల్లి మాతృమూర్తి కాలం చేయ‌టంతో ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స‌న్నిహితునిగా ఉండ‌వ‌ల్లి ని చెబుతారు. 
త‌ర్వాత ఆయ‌న‌ పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం చేరుకొన్నారు. అక్క‌డ స్థానిక నేత‌ చిన్నారావు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. చిన్నారావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితులు. చిన్నారావు ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఇవాళ చిన్నారావు కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి బుట్టాయగూడెం చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఇంట్లో వైఎస్ జగన్ రాత్రికి బస చేశారు. 
Back to Top