పీపీరావు మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

హైద‌రాబాద్‌: సీనియ‌ర్ సుప్రీం కోర్టు న్యాయ‌వాది పావ‌ని ప‌ర‌మేశ్వ‌ర‌రావు(పీపీరావు) మృతి ప‌ట్ల  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం తెలిపారు.  ప్ర‌కాశం జిల్లాకు చెందిన పీపీరావు న్యాయ‌వాదిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని వైయస్ జగన్ కొనియాడారు. ప‌లు జాతీయ, అంత‌ర్జాతీయ క‌మిటీలు, వేదిక‌ల్లో  భాగ‌స్వామ్యులై నిర్వ‌హించిన పాత్ర ఎన‌లేనిద‌ని, పీపీరావు సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. పీపీరావు కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top