వైయ‌స్ జగన్ సీఎం కావ‌డం త‌థ్యం

విజయనగరం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ధీమా వ్య‌క్తం చేశారు. మండలంలో ఆగూరు, రెల్లిగూడేం గ్రామాల్లో  మండల పార్టీ అధ్యక్షులు రెడ్ది సన్యాసినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులు పాశల ప్రసాదరావు, ఆకుల అప్పారావు, రాళ్లపల్లి రామప్పడు, పోలయ్య, జ్యోతి, పొట్నూరు తాత తదితరలు మాట్లాడుతూ తమకు కొత్తగా ఇళ్లు, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఎస్సీ, ఎస్టీ రుణాలు మంజూరు చేయడంలేదని రాజన్నదొర ముందు వాపోయారు. రాజన్నదొర మాట్లాడుతూ కొత్త పింఛన్లు ఇవ్వకపోయినా అర్హత ఉన్న వారి పింఛన్లు తొలగించినా, గతంలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలకు బిల్లులు చెల్లింపు లో రాజకీయం చేస్తే ప్రజలు క్షమించరని ఆయన మండిపడ్డారు. గతంలో పండు జుంతు కనిపిస్తే చాలు పింఛను మంజూరు చేశామని, వితంతువులు, వికలాంగు లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు రాజకీయాలకు అతీతంగా తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉన్న వారికి, వయస్సు ఎక్కువగా ఉండి రేషన్‌ కార్డులో తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా పింఛన్లు అందజేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో యువజన అధ్యక్షులు రాయిపల్లి రామారావు, బడేవలస సర్పంచ్‌ తాడ్డి రామునాయుడు, నాయుకులు బాయి అప్పారావు, హరి బంగార్రాజు,  పాశల ప్రసాదరావు ,ఆకుల అప్పారావు, పెంట తాడయ్య, దంతులూరి చిన్నా, రెడ్ది అప్పలనాయుడు, పుర్నాన అప్పలనాయుడు, యండపల్లి పరిదేశి, జి. సన్యాసిరావు, పలువురు నాయుకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top