ప్రజల ఆశాజ్యోతి వైయస్‌ జగన్‌...

శ్రీకాకుళంఃరాష్ట్రంలో టీడీపీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిగిపోయారని  వైయస్‌ఆర్‌సీపీ నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త ధర్మాన కృష్ణదాసు అన్నారు.వైయస్‌ జగన్‌ను ప్రజలు ఆశాజ్యోతిగా భావిస్తున్నారన్నా. రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి సాధించాలంటే  వైయస్‌ జగనే శరణ్యమన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.నరనసన్నపేట వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులు మంజూరు చేశారన్నారు. నరసన్నపేటలో యువతకు ఉద్యోగాల కల్పనకు  పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. క్రీడాకారులకు స్టేడియం కూడా నిర్మించాలని కోరామన్నారు.ప్రజా సంకల్పయాత్రకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు.నేడు జరగబోయే వైయస్‌ జగన్‌ బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top