మా మొదటి ఓటు జగనన్నకే..

వైయస్‌ జగన్‌ను కలిసిన యువత...
శ్రీకాకుళంః వైయస్‌ఆర్‌ హయాంలో తమ గ్రామానికి ఎంతో మేలు జరిగిందని వంగర మండలం వీవీఆర్‌పేట మహిళలు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో  వైయస్‌ జగన్‌ను కలిసి జరిగిన అభివృద్ధిని వివరించారు.మహానేత చేసిన అభివృద్ధికి గుర్తుగా ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నామని తెలిపారు.వైయస్‌ జగన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు.కొంతమంది యువత మాట్లాడుతూ ఈ ఏడాది ఓటు హక్కు వచ్చిందని మా మొదటి ఓటు జగనన్నకే వేస్తామని తెలిపారు.నవరత్నాల పథకాలతో అందరికి మేలు జరుగుతుందని తెలిపారు.జగన్‌ సీఎం అయితే రాష్ట్రంతో పాటు మా గ్రామం బాగుపడుతుందన్నారు.జగన్‌ కావాలి.జగన్‌ రావాలి అంటూ యువత ఉత్సాహం నినాదాలు చేశారు.

Back to Top