అదంతా పచ్చమీడియా దుష్ర్పచారం

నెల్లూరు: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే  రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. తనపై ఎల్లో మీడియా కానాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.  తాను జగనన్న వెంటే ఉంటానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పచ్చ ప్రలోభాలకు తాను లొంగేది లేదని, అవాస్తవాలను ప్రసారం చేయటం తగదని ఎల్లోమీడియాను హెచ్చరించారు. కాగా పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని బాబు చేస్తున్న నీచ రాజకీయాలపై ప్రజలు, ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.

Back to Top