పార్టీ గెలుపుకు బాటలు వేయండి

విజయనగరం: పార్టీని బూత్‌ స్థాయిలో పటిష్ట పరిచి వైయస్‌ఆర్‌ సీపీ గెలుపుకు బాటలు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా అరకు వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరం పేరులోనే విజయం ఉందని, జిల్లాలో ఒక ఎంపీ సీటు, తొమ్మిది అసెంబ్లీ సీట్లను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చని, క్షేత్రస్థాయిలో బూత్‌ లెవల్‌ కమిటీల్లో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకొని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. 
Back to Top