రాష్ట్ర మ‌హిళా కార్య‌వ‌ర్గ స‌మావేశం ప్రారంభం

విజ‌య‌వాడ‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మ‌హిళా కార్య‌వ‌ర్గ స‌మావేశం ఈ రోజు విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.  ఈ స‌మావేశంలో బాబు పాల‌న‌లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై చ‌ర్చిస్తున్నారు. స‌మావేశానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు ఆర్కే రోజా, మ‌హిళా నాయ‌కురాళ్లు వాసిరెడ్డి ప‌ద్మ‌, ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి, నిర్మ‌ల‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. ప్ర‌ముఖ్యంగా  రాష్ట్రంలో బెల్టుషాపులు వీధికొక‌టి వెలుస్తున్నాయ‌ని, వీటి వ‌ల్ల మ‌హిళ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, బెల్టుషాపుల‌పై ఉద్య‌మించాల‌ని స‌మావేశంలో తీర్మానం చేశారు.
Back to Top