<br/>విజయనగరంః వైయస్ జగన్‌ను కలిసిన మక్కువ బీసీ కాలనీ మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. పంటలు సరిగా పండక వలసపోతున్నామని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించాలని జననేతను కోరారు. టీడీపీ వచ్చాక ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదని వాపోయారు. టీడీపీ పాలనలో మహిళ సంక్షేమం పూర్తిగా విస్మరించారన్నారు.దివంగత నేత వైయస్‌ఆర్ హయాంలో మహిళలకు ఎంతో మేలు జరిగిందన్నారు.రాజన్న హయాంలో మహిళలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు అధిక సంఖ్యలో కల్పించి మహిళా సాధికారితకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషిచేశారని కొనియాడారు.