జ‌గ‌న‌న్న‌ను సీఎంను చేసుకుంటాం

ఒంగోలు: ప‌్ర‌జాప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. భార‌తీ త‌ర‌లివ‌స్తూ జ‌నేన‌త వెంట న‌డుస్తున్నారు. చిన్నారిక‌ట్ల నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్‌ను స్థానిక మ‌హిళ‌లు క‌లిసి వారి బాధ‌లు చెప్పుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని కోరారు. నీళ్లు లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, పంట‌లు పండ‌క రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు.  అనంత‌రం మ‌హిళ‌లు మీడియాతో మాట్లాడుతూ రాజ‌న్న‌బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. ఈసారి ఎలాగైనా మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని మ‌హిళ‌లు గంటాప‌దంగా చెప్పారు. 
Back to Top