హైదరాబాద్) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. నల్ల దుస్తులతో సభకు హాజరు అయ్యేందుకు ప్రయత్నించారు. సభలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మార్షల్స్ అడ్డుకొన్నారు. దీంతో మహిళా ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం సాక్షిగా ఆందోళనకు దిగారు.