ఇదేనా మ‌హిళా సాధికారిక‌త‌

విజ‌య‌వాడ‌: మ‌హిళా స‌ద‌స్సులో పాల్గొన‌కుండా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను అడ్డుకోవ‌డం ఇదేనా మ‌హిళా సాధికారిక‌త అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి మండిప‌డ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..మ‌హిళా స‌ద‌స్సుకు మ‌మ్మ‌ల్ని ఆహ్వానించి రోజాను ఎయిర్‌పోర్టులోనే నిర్భందించారంటే మ‌హిళ‌లంటే ఎంత‌టి చిన్న‌చూపో అర్థ‌మ‌వుతుందన్నారు. రోజాకు జ‌రిగిన అన్యాయం, మ‌హిళా ప్ర‌తినిధుల‌కు జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై  ఈ స‌ద‌స్సులో మేం నోరువిప్పుతామ‌ని భ‌య‌ప‌డిన చంద్ర‌బాబు మ‌మ్మ‌ల్ని గొంతు నొక్కుతున్నారు. రోజా అరెస్టుపై చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి.. లేదంటే రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌డుతామ‌ని ఆమె హెచ్చ‌రించారు.  ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సునే కించ‌ప‌రిచేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సార‌ధ్యంలో ఉద్య‌మం ఉధృతం చేస్తామ‌ని గిడ్డి ఈశ్వ‌రి హెచ్చ‌రించారు.

Back to Top