బాల‌కృష్ణ మీద మ‌హిళ‌ల ఆగ్ర‌హం

అనంత‌పురం:  సినీ హీరో, తెలుగుదేశం ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్త‌న మీద మ‌హిళా లోకంలో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో మ‌హిళ‌ల‌ను చాలా కించ‌పరిచే విధంగా ఆయ‌న మాట్లాడారు. దీని మీద స్తానిక‌, జాతీయ టీవీ చానెళ్ల‌లో చ‌ర్చ‌లు న‌డిచాయి. మ‌హిళా మండ‌ల్లు, ప్ర‌జా సంఘాల నాయ‌కులు ఈ వ్యాఖ్య‌ల్ని ఖండించారు. 
ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ నియోజ‌క వ‌ర్గం హిందూపురంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద  రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే పదవికి బాలకృష్ణ అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ..  అమ్మాయిలకు ముద్దయినా పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి, కమిట్ అయిపోవాలి.. అంటూ బాలకృష్ణ  వ్యాఖ్యానించడం దారుణమన్నారు. మహిళల గురించి నిజజీవితంలో ఇంత హీనంగా మాట్లాడే ఆయన సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంటారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా మండల కన్వీనర్ షామింతాజ్, రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిలర్లు రజనీ, షాజియా, జయమ్మ, శివ, ఆసీఫ్‌వుల్లా, నాగభూషణరెడ్డి, అంజినప్ప, నాయకులు సమద్, రియాజ్, నంజిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, రఘు, నరసింహారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, గిరి, రఘు,న్యాయవాది గంగధర్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top