చేనేతకు అండగా ఉంటా..వైయస్ జగన్ మోహన్ రెడ్డి


మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు
– చేనేత కార్మికులకు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  భరోసా
చేనేతలకు మోసం చేసిన చంద్రబాబు
చంద్రబాబు పాలన పోయే రోజులు దగ్గర్లోనే
–నూలుపై సబ్సిడీ రూ.2 వేలు చెల్లిస్తాం
–అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే  పింఛన్లు
– ఫింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతా
పేదలందరికీ 25 లక్షల ఇల్లు కట్టిస్తా
హ్యాండ్‌లూమ్‌ కార్పొరేషన్‌  ఏర్పాటు
– అందరం ఒక్కటవుదాం..మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం
– చేతల కార్మికుల దీక్షకు వైయస్‌ జగన్‌ సంఘీభావం

 ధర్మవరం:  మరో ఏడాదిలో మంచి మనసున్న మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడని, మీ కష్టాలు తీర్చుతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేనేత కార్మికులకు భరోసా కల్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని, బాధిత కుటుంబాలను పట్టించుకునే నాథుడు లేడని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, అందరం ఒక్కటై మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. ధర్మవరం పట్టణంలో 37 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న చేనేతల ఆందోళనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సంఘీభావం తెలిపారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి చేనేతల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ మాట్లాడారు.
– ఈ రోజు ధర్మవరంలో దాదాపుగా 37 రోజుల పాటు నిరాహారదీక్షలు చేపడుతున్నారు. ఇదే ధర్మవరంలో పట్టు వస్త్రాలకు చేనేతకు ప్రఖ్యాతి గాంచిన పట్టణం. ఈ ఊరు గురించి దేశమంతా మాట్లాడుతారు. అలాంటి ధర్మవరంలో చేనేతలు చంద్రబాబు సీఎం అయ్యాక ఎంత మంది చనిపోయారో మనకు తెలుసు అన్నారు. ఒక్కరు కాదు ..ఇద్దరు కాదు, ఏకంగా 65 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి ప్రభుత్వం సాయం చేసిందని ఆయన ప్రశ్నించారు. 
– వైయస్‌ జగన్‌ ధర్మవరానికి వస్తున్నాడని, చనిపోయిన కుటుంబాల దగ్గరకు వెళ్తున్నారని, అప్పుడు మాత్రమే కేవలం 11 మందికి మాత్రమే ముష్టి  వేసినట్లు చంద్రబాబు సాయం చేశారు. ఆ సాయం ఎంతో తెలుసా..రూ.1.50 లక్షలు మాత్రమే అన్నారు. వైయస్‌ జగన్‌ ధర్మవరం నుంచి వెళ్లగానే మళ్లీ వారిని పట్టించుకునే నాథుడు లేడన్నారు.
– ధర్మవరంలోనే 37 రోజుల నుంచి అక్క చెల్లెమ్మలు నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఈ దీక్షలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఫైర్‌ అయ్యారు. 
– చంద్రబాబు పాలన రాకముందు పట్టు మీద కనీసం రూ. 600 సబ్సిడీ వచ్చేదన్నారు. ఆ రోజుల్లోనే 25 శాతం సబ్సిడీ వచ్చేదన్నారు.
– ఇవాల్టికి చంద్రబాబు సీఎం అయ్యి 41 నెలలు పూర్తి అయ్యిందన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఎన్ని నెలలు సబ్సిడీ ఇచ్చారని నిలదీశారు. అప్పట్లో కనీసం ఒక్క పూటకైనా భోజనం అందేదన్నారు. 
– చేనేత దినోత్సవం రోజు మాత్రం చంద్రబాబు వచ్చి రూ.600 సబ్సిడీని వెయ్యి రూపాయాలు చేస్తానని ప్రకటించారన్నారు. ఆ తరువాత ఇచ్చింది అక్షరాల రెండే రెండు నెలలు ఇచ్చారని విమర్శించారు. 13 నెలల బకాయిలు ఉన్నాయని చేనేతలు తెలిపారన్నారు. 
–  చంద్రబాబు మాట చెప్పిన తరువాత మళ్లీ బకాయిలు 10 నెలలు ఉన్నాయని చెప్పారు.  వైయస్‌ జగన్‌ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చిన తరువాతనైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.
–  ఎన్నికల సమయంలో రైతులను, చదువుకుంటున్న పిల్లలను మోసం చేశాడని, అవ్వ, తాతలను, చేనేతలను వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు.
– ఎన్నికల సమయంలో చంద్రబాబు మగ్గం పట్టుకొని మంచి సినిమా ఫోజు కొట్టారని ఎద్దేవా చేశారు. చేనేతల రుణాలు పూర్తిగా మాఫి చే స్తానని చెప్పారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల రుణాలు ఎంత వరకు మాఫీ చేశారని ప్రశ్నించారు. రూ.87 వేల కోట్ల రుణాలు ఉన్న రైతులకు మోసం చేశాడు అనుకున్నా..చేనేతలను కూడా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేనేతలకు సంబంధించి రూ.390 కోట్లలో కూడా రూ.190 కోట్లకు కుదించారన్నారు. ఇందులో కూడా పూర్తిగా ఇవ్వకుండా రూ.70 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 
– చేనేత కుటుంబాలకు అతి తక్కువ వడ్డికే రుణాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఇవాళ చేనేత కుటుంబాలకు రుణాలు అందడం లేదన్నారు.
– ప్రతి  చేనేత కుటుంబానికి రూ.1.50 ఇల్లు, మగ్గం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారని తెలిపారు. మూడున్నరేళ్లు పూర్తి కావొస్తున్నా ఏ ఒక్కరికి ఇల్లు కట్టించలేదన్నారు. 
– చేనేత కార్మికులకు రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధి, ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తానని నమ్మించి మోసం చేశాడన్నారు.
–చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఏ జిల్లాలో కూడా చేనేత పార్కు కనిపించలేదన్నారు. 
–వెయ్యి కోట్ల నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు 2014–15లో రూ.98 కోట్లు, 2015–16లో రూ.45.92 కోట్లు, 2016–2017లో రూ. 120 కోట్లు అని వివరించారు. ఇస్తామన్న రూ, వెయ్యి కోట్లు ఎక్కడా అని నిలదీశారు.
–చేనేతలు ఇంతకు ముందు ఉచితంగా వైద్యం చేయించుకునే వారు. బాబు సీఎం అయ్యాక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా కొల్పొయారన్నారు.
–చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్కోను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
–ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయని, బట్టలకు మాత్రం ధర లేదని తెలిపారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు.
–చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లే అన్న సామెత, చెవిటోడి ముందర శంకం ఊదినట్లే అన్నారు.
– చంద్రబాబు పాలన పోయే కాలం దగ్గర్లోనే ఉందన్నారు. ఏడాదికే ఎన్నికలు వస్తాయని చెప్పారు.
–అందరం కలుద్దాం..ఒక్కటవుదాం. మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
– ప్రతి చేనేత కార్మికుడిని నేను అండగా ఉంటానని, ఒక మంచి అన్నగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
–హ్యాండ్‌లూమ్‌ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
– నూలుపై ప్రతి నెల రూ.2 వేల సబ్సిడీ ఇస్తానని చెప్పారు.
–మనసున్న నేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే  పింఛన్లు ఇస్తానని హామీ ఇచ్చారు. పింఛన్‌ కూడా రూ.2 వేలు ఇస్తానని మాటిచ్చారు.
–అన్న ముఖ్యమంత్రి అవుతాడని దేవుడ్ని ప్రార్థించండి..మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. అక్షరాల 25 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పారు.
–అన్న ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించండి..ఇంటింటికి వడ్డి లేకుండా లక్ష రూపాయల రుణం ఇప్పిస్తా.
–నవ రత్నాలను ప్రకటించే సమయంలో ఎన్నికలకు ఏడాది ముందే నవరత్నాలు ప్రకటిస్తే..చంద్రబాబు కూడా రూ.2 వేలు ఇస్తారని చెప్పారని తెలిపారు.
–చంద్రబాబు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తే ఆ క్రెడిట్‌ వైయస్‌ జగన్‌కే దక్కుతుందని చెప్పానని తెలిపారు. 
– వెంటనే నేను ఏం చేయలేకపోవచ్చు అని, ఏడాదికే ఎన్నికలు వస్తాయని, అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దామని, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
– పారిశ్రామిక వేత్త  శివారెడ్డి పార్టీలో చే రారు.Back to Top