విశ్వబ్రాహ్మణులను అన్నివిధాల ఆదుకుంటాం..


ఎమ్మెల్సీ స్థానంతో పాటు జీవో నెం.272లో చట్టసవరణ
జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

విజయనగరంః విశ్వ బ్రాహ్మణులకు అని విధాలుగా ఆదుకుంటామని జననేత వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కోరుకొండ వద్ద వైయస్‌ జగన్‌ను కలిసిన విశ్వబ్రాహ్మణులు
తమ సమస్యలపై వినతిప్రతం అందించి సమస్యలు చెప్పుకున్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను సావధానంగా విన్నారు. చేతివృత్తులవారు మాత్రమే తాళిబొట్టు తయారుచేసే విధంగా చట్టసభలో తీర్మానం చేస్తామని జననేత అన్నారు. కార్పొరేట్‌ జ్యువెలరీ షాపుల పోటి నుంచి తట్టుకునే విధంగా విశ్వబ్రాహ్మణులకు తాళిబొట్టు తయారుచేసే హక్కు కల్పిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల కార్పొరేషన్ల ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు ఇస్తామని తెలిపారు. విశ్వ బ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నెం.272లో చట్టసవరణ చేస్తామన్నారు. దొంగ బంగారం పేరుతో పోలీసుల వేధింపుల లేకుండా చట్టంలో మార్పు తీసుకొస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామన్నారు.
Back to Top